సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)ను అదే గ్రామానికి చెందిన పులిగడ్డ ప్రభాకర్(28) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ నాలుగు రోజులుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక పట్ల ప్రభాకర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలిక పట్ల వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
బాలిక ప్రతిఘటించి.. గట్టిగా కేకలు వేయడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. భూ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. అనిశాకు చిక్కిన సీఐ