ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక గర్భం దాల్చింది. పదో తరగతి చదివే ఇద్దరు మైనర్లు ప్రేమపేరుతో శారీరకంగా కలిశారు. బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులను ఆమె తల్లి గమనించింది. ఏం జరిగిందని బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
పదో తరగతి విద్యార్థుల ప్రేమ... గర్భం దాల్చిన బాలిక - love in tenth class
ఏపీలోని గుంటూరు జిల్లాలో మైనర్ బాలిక గర్భం దాల్చటం పోలీసు కేసు వరకూ వెళ్లింది. పదో తరగతి చదివే ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో శారీరకంగా కలిశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మైనర్ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పదో తరగతి విద్యార్థుల ప్రేమ... గర్భం దాల్చిన బాలిక
ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. బాలుడిని బాలిక తల్లిదండ్రులు నిలదీశారు. అమృతలూరు పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మైనర్ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీచూడండి: లాక్‌డౌన్‌తో గర్భిణీలకు వైద్యసంకటం.. 18.5 లక్షల మందిపై ప్రభావం