తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రేమ బాధితురాలు - love failure suicide

ప్రేమ అన్నాడు. ఎన్నో మాటలు చెప్పాడు. తీరా పెళ్లి సంగతి వచ్చేసరికి దాటేయబోయాడు. పెద్దలతో చెప్పిస్తేనైనా వింటాడనుకుంటే... అందరి ముందు సరేనని ఆ తర్వాత పరారయ్యాడు. ఆ మోసాన్ని భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమలో ఓడిన ఆ బాలిక... మృత్యువుతో సైతం నెల రోజులుగా పోరాడి అందులోనూ ఓడిపోయింది.

minor girl died after one month in badradri kothagudem
minor girl died after one month in badradri kothagudem

By

Published : Oct 4, 2020, 4:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురానికి చెందిన 16ఏళ్ల అమ్మాయి... అదే గ్రామానికి చెందిన తాటి ప్రవీణ్(23) ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం ఎత్తగానే యువకుడు నిరాకరించాడు. గ్రామంలోని పెద్దల జోక్యంతో బాలికను వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించినట్టు నమ్మించి... శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికను మోసం చేసి పారిపోయాడు.

తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక సెప్టెంబర్ 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పటి నుంచి విషమంగా ఉన్న బాలికను ఖమ్మం, కొత్తగూడెం ఆసుపత్రులలో చికిత్స చేయిస్తూ... కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు మృతి చెందింది.

యువకుడు చేసిన మోసాన్ని సెప్టెంబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశామని.. బాలిక తండ్రి తెలిపారు. ప్రేమ పేరుతో మోసం చేసి... తన కూతురు మరణానికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోస్టుమార్టం వద్దకు చేరుకున్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఆందోళన చేశారు.

ఇదీ చూడండి: దారుణ ఘటన.. గొంతుకోసి భర్తను చంపిన భార్య...

ABOUT THE AUTHOR

...view details