తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలికపై ఉన్మాదుల ఘాతుకం - dadi

ప్రపంచమంతా వైభవంగా మహిళా దినోత్సవం జరుపుకున్న రోజునే  ఓ బాలిక జీవితంలో  అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తెలిసిన వారే కదా అని నమ్మి వెంటవచ్చింది. వారిలోని పైశాచికత్వాన్ని ఊహించలేకపోయింది. చెడు వ్యసనాలకు బానిసై చివరికి వారిచేతిలోనే చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకు గురైంది. హైదరాబాద్​ నగర నడిబొడ్డులో జరిగిన ఈ ఘటన తెల్లారేసరికి నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది.

బాలికపై ఉన్మాదుల ఘాతుకం

By

Published : Mar 9, 2019, 10:41 AM IST

Updated : Mar 9, 2019, 11:48 AM IST

బాలికపై ఉన్మాదుల ఘాతుకం

హైదరాబాద్ గాంధీనగర్​ పరిధిలో దారుణం జరిగింది. నమ్మి వెంట వచ్చిన ఓ మైనర్​ బాలికను వివస్త్రను చేసి, బ్లేడుతో విచక్షణారహింతగా దాడిచేశారు ముగ్గురు మైనర్​ బాలురు. ఈ ఉదంతాన్నంతా చరవాణిలో చిత్రీకరించి తమ కృూరత్వాన్ని ప్రదర్శించారు.

నమ్మింది...మోసపోయింది...

మైసమ్మ గూడాకు చెందిన ఓ బాలిక అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురుతో స్నేహంగా ఉండేది. వారు ఆ అమ్మాయికి గంజాయి అలవాటు చేశారు. శుక్రవారం రాత్రి వారితో పాటు లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్​ మిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి గంజాయి సేవించారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని చరవాణిలో రికార్డ్ చేశారు. కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడినా వదల్లేదు. ఎలాగోలా వారినుంచి తప్పించుకుని బయటపడిన ఆ బాలికను స్థానికులు గమినించి ఆసుపత్రిలో చేర్పించారు. బాలురకు దేహశుద్ధి చేసి గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:తల్లి తిట్టిందని యువకుడు ఆత్మహత్య

Last Updated : Mar 9, 2019, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details