తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బోడకొండ జలపాతంలో పడి​ బాలుడి మృతి - రంగారెడ్డి జిల్లా నేర వార్తలు

బోడకొండ జలపాతం అందాలను చూసేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారీ జలపాతంలో పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Minor boy dies after falling into Bodakonda waterfall
బోదకొండ జలపాతంలో పడి మైనర్​ బాలుడు మృతి

By

Published : Sep 20, 2020, 10:14 PM IST

Updated : Sep 21, 2020, 4:01 PM IST

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. బోడకొండ జలపాతం చూడడానికి వచ్చిన ఈశ్వర్​సింగ్ (16)​ అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారీ జలపాతంలో పడి మృతి చెందాడు.

అత్తాపూర్​నకు చెందిన ఈశ్వర్ సింగ్ తన 8 మంది స్నేహితులతో కలిసి బోడకొండ జలపాతం అందాలను చూసేందుకు వచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. గుర్తించిన స్నేహితులు ఈశ్వర్​సింగ్​ను బయటకు తీశారు. తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఈశ్వర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.. బీ అలర్ట్​: కస్టమర్​ కేర్​ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు

Last Updated : Sep 21, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details