ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి. గురువారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్‌కు తన కాన్వాయ్‌తో మంత్రి వెళ్తుండగా బాహ్య వలయ రహదారి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చూడగానే మంత్రి కారు దిగారు. గాయపడ్డ వ్యక్తిని సిబ్బంది సాయంతో కారులో తీసుకొని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
మంత్రి మానవత్వం... ఒకరి ప్రాణాలు కాపాడారు! - హైదరాబాద్ జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి పట్ల వెంటనే స్పందించి మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. బాహ్యవలయం సమీపంలో కాన్వాయ్‌తో వెళ్తున్న మంత్రి స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే కారు దిగారు.
![మంత్రి మానవత్వం... ఒకరి ప్రాణాలు కాపాడారు! minister malla reddy helped to injured person at orr in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9595305-305-9595305-1605791281576.jpg)
మంత్రి మానవత్వం... కారు దిగి ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టారు
ఆ వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. మానవత్వం చాటుకున్న మంత్రి అని ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్