తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

20 గొర్రెలను బలి తీసుకున్న పాలవ్యాన్​ - గొర్రెల మందను ఢీకొట్టిన పాలవ్యాన్​

రోడ్డు వెంబడి ప్రశాంతంగా వెళ్తున్న గొర్రెలను ప్రమాదం పేరుతో పాలవ్యాన్​ కాటేసింది. వేగంతో దూకుకొచ్చిన వాహనం ఆ జీవాలను ఢీకొట్టింది. ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

milk van crashed into a flock of sheep at karimnagar district
20 గొర్రెలను బలి తీసుకున్న పాలవ్యాన్​

By

Published : Sep 28, 2020, 9:52 AM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిలో రామకృష్ణ కాలనీ వద్ద వేగంగా వచ్చిన పాలవ్యాన్ రోడ్డు వెంబడి వెళ్తున్న గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఘటనలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరి కొన్నింటికి గాయాలయ్యాయి.

మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన గొర్ల కాపరి వెంకటేష్ కరీంనగర్ వైపు నుంచి సిద్దిపేటకు జీవాలను తీసుకుని వెళ్తున్నాడు. ఆ క్రమంలో తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీకి చేరుకోగానే కరీంనగర్ డైరీకి చెందిన పాలవ్యాన్​ వేగంగా వచ్చి గొర్రెల మందను ఢీకొట్టింది. ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి.

స్థానికులు డ్రైవర్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి నష్టపరిహారం అందించాలని రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఎల్ఎండీ ఎస్​ఐ కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించాడు. పాలవరం యజమాని సంబంధీకులు వచ్చి 1,20,000 పరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడం వల్ల సమస్య సద్దుమణిగింది.

ఇదీ చూడండి :అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. ఆయుధాలు, వాహనాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details