హైదరాబాద్ గోపాలపట్నం పరిధిలోని రెజిమెంటల్ బజార్లోని శ్యాం శంబర్స్ అపార్ట్మెంట్లో కట్ట గిఫ్ట్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఆదివారం రాత్రి అందరూ పడుకున్నాక.. రెండు గంటల సమయంలో హఠాత్తుగా నిద్ర లేచి చూడగా తన కుమారుడు గిఫ్ట్ కనిపించలేదని తల్లి మనికమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆవేదన - హైదరాబాద్లో మిస్సింగ్ కేసులు తాజా వార్త
మతి స్థిమితం కోల్పోయిన ఒక యువకుడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం..
కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్మెంట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, బంధువులు, స్నేహితులు ఇళ్లలో వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదని వాపోయారు. మతిస్థిమితం లేని తమ కుమారుడు ఎక్కడి వెళ్లాడో అని విలపిస్తూ గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:ఆడుకుంటూ కిందపడి తొమ్మిది నెలల చిన్నారి మృతి