అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. హుస్నాబాద్‌కు చెందిన అందే సమ్మయ్య మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కరీంనగర్‌లోని జ్యోతి నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా అప్పులతో సతమతమవుతోన్న సమ్మయ్య.. ఆదివారం రాత్రి భార్యకు, కుమారునికి పురుగుల మందు తాగించి అతను కూడా సేవించాడు. అనంతరం 100 నంబరుకి కాల్ చేశాడు.
అప్పుల బాధ తాళలేక.. పురుగుల మందు సేవించి.. - కరీంనగర్‌లో సూసైడ్ వార్తలు
అప్పుల బాధ తాళలేకపోయాడు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను చనిపోయి భార్యా పిల్లల్ని ఇబ్బందుల్లోకి నెట్టొద్దనుకున్నాడేమో.. వారిని కూడా మృత్యు శిఖరాలకు చేర్చాలనుకున్నాడు. అందుకే వారితో పురుగుల మందు తాగించి అతనూ సేవించాడు. కరీంనగర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

అప్పుల బాధ తాళలేక.. పురుగుల మందు సేవించి..
సమాచారం అందుకున్న పోలీసులు వారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. కాగా కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతను తీసుకున్న నిర్ణయంతో ఆ చిన్నారి అనాథగా మిగిలిపోయాడు.