మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీ ఆస్పత్రిలో మెడికల్ పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఝాన్సీ.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె స్వస్థలం నర్సాపూర్ అని పోలీసులు తెలిపారు.
మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థిని ఆత్మహత్య - hyderabad news
మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బేగంపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
ఝాన్సీ కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతోందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: గుత్తేదారుల నిర్లక్ష్యం... కూలిన బతుకులు
Last Updated : Dec 5, 2020, 11:32 AM IST