గతేడాది డిసెంబరు 3న మేడ్చల్ జిల్లా ఏదులాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోషా... జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. 4 ఏళ్ల క్రితం భర్త వదిలేయటంతో కోళ్ల ఫారంలో పనిచేస్తూ... ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులతో నివసించేది. అక్కడే పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన వినోద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
వీడిన మిస్టరీ: వివాహేతర సంబంధమే హత్యకు కారణం - అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గతేడాది డిసెంబరు 3న మేడ్చల్ జిల్లా ఏదులాబాద్‌లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంతోషా హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. మహారాష్ట్రకు చెందిన వినోద్‌తో పెళ్లి విషయంలో తలెత్తిన గొడవలే హత్యకు దారితీశాయని పోలీసులు వివరించారు.
పెళ్లి చేసుకోవాలని వినోద్ ఒత్తిడి తీసుకురాగా.. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సంతోషా తిరస్కరించింది. పెళ్లి విషయంలో ఇద్దరు పలుమార్లు గొడవ పడినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరు 3న మధ్యాహ్నం ఇద్దరు ఏదులాబాద్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరి మధ్య గొడవ కావటంతో తాడుతో సంతోషాకు ఉరి వేసి... అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి... తూంకుంటలో వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి:ఆటోను ఢీకొన్న వ్యాన్.. ముగ్గురు దుర్మరణం