సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దాయార గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... పారిశ్రామిక వాడల నుంచి కాలుష్య జలాలు గండిగూడ చెరువులో చేరి... దానిలోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి.
చేపలు చేతికొస్తాయనుకుంటే.. చనిపోయాయి
రెండు రోజులుగా కురస్తున్న వర్షాలకు పారిశ్రామిక వాడల నుంచి కాలుష్య జలాలు చెరువులో చేరి... దానిలోని చేపలన్నీ చనిపోయిన ఘటన అమీన్పూర్ మండలంలోని దాయార గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.
చేతికొస్తాయనుకున్న సమయంలో... మృతి చెందిన చేపలు
2 నుంచి 3 కిలోలు ఎదిగి.. చేతికి వస్తున్నాయనుకునే సమయంలో చేపలన్నీ చనిపోయాయని.. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగిందని... దాని నుంచి కోలుకోకముందే మళ్లీ ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో కుండపోత వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు