తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాటన్​ జిన్నింగ్​మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. 2కోట్ల నష్టం - Suryapeta District Crime News

సూర్యాపేట జిల్లాలోని కాటన్​ జిన్నింగ్​ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 2వేల 800 క్వింటాల పత్తి దగ్ధమైంది. దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాటన్​ మిల్లు యాజమాన్యం అంచనా వేసింది.

Suryapeta District Thirumalagiri
కాటన్​ జిన్నింగ్​మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. 2కోట్ల నష్టం

By

Published : Nov 21, 2020, 8:03 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీ సంతోషిమాత కాటన్​ జిన్నింగ్​ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 2వేల 800 క్వింటాల పత్తి దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే చర్యలు చేపట్టింది. దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాటన్​ మిల్లు యాజమాన్యం అంచనా వేసింది.

ట్రాక్టర్​లోని పత్తిని దిగుమతి చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్​కు సెల్ఫ్ లేక పోవడంతో అదనపు బ్యాటరి సహాయంతో స్టార్ట్ చేస్తుండగా బ్యాటరీ నుంచి స్పార్కింగ్ వచ్చి పక్కనే ఉన్న పత్తికి మంటలు అంటుకున్నాయి. దీనితో భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

కాటన్​ జిన్నింగ్​మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. 2కోట్ల నష్టం

ఇవీ చూడండి:'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details