తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చూస్తుండగానే దగ్ధమైన మారుతి వ్యాన్​ - సంగారెడ్డి జిల్లా లేటెస్ట్​ వార్తలు

ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మారుతి వ్యాన్​ దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా మాడిగి రోడ్డులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

maruthi van burned in sangareddy district
చూస్తుండగానే దగ్ధమైన మారుతి వ్యాన్​

By

Published : Dec 23, 2020, 8:05 PM IST

సంగారెడ్డి జిల్లా మాడిగి రోడ్డులో మారుతి వ్యాన్​ దగ్ధమైంది. మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో జరిగిన వివాహానికి కర్ణాటకలోని మన్నెకెళ్లి పట్టణానికి చెందిన అంబాదాస్ భార్యాబిడ్డలతో వచ్చారు. తిరుగు ప్రయాణంలో మాడిగి వద్దకు రాగానే మారుతి వ్యాన్​లో గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావటంతో అప్రమత్తమైన అంబదాస్ కుటుంబ సభ్యులతో కిందికి దిగిపోయాడు.

వెనువెంటనే మంటలు వ్యాపించి క్షణాల్లో మారుతి వ్యాన్ కాలి బూడిదయింది. ఘటన స్థలాన్ని చిరాగ్​పల్లి ఎస్సై గణేశ్​ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతకు దిల్లీ నుంచి పిలుపు

ABOUT THE AUTHOR

...view details