హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎల్ కాలనీలో ఉంటున్న మమత అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యచేసి బలవన్మరణంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వివాహిత అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యే అంటున్న భర్త - Married women suspicious death in Chaitanyapuri area
చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. ఆత్యహత్య చేసుకుందని భర్త చెబుతుండగా... భర్తే హత్యచేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యే అంటున్న భర్త
ఈ మేరకు భర్త కమలాకర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.