సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సిరూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దాపురం నాగమణి తన భర్త, అత్త వేధింపులు తాళలేక 13 నెలల కూతురు సాయిశ్రీతో కలిసి... పంచాయతీ కార్యాలయం పక్కనున్న నీటి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
13 నెలల పాపతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్య - suicide news in sirur
వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత తన పదమూడు నెలల పాపతో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సిరూర్లో జరిగింది.
married women suicide with her 13 months daughter
భర్త నగేశ్, అత్త శర్ణమ్మ కొద్ది నెలలుగా అదనపు కట్నం కోసం వేధించారని... తట్టుకోలేకే నాగమణి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తరఫు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని బావి నుంచి మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.