తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి.. వివాహిత ఆత్మహత్య! - భద్రాద్రి వార్తలు

యువకుడి వేధింపులకు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని యువకుడి ఇంటి ముందు పెట్టి ఆందోళన నిర్వహించారు. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చేయలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Married Women Suicide In Bhadraadri Kothagudem District
పురుగుల మందు తాగి.. వివాహిత ఆత్మహత్య!

By

Published : Aug 28, 2020, 8:34 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభా నగర్​లో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడి వేధింపులు తాళలేక అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి బంధువులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మృతదేహాన్ని యువకుడి ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. జూలూరుపాడు పోలీస్​ స్టేషన్​లో యువకుడి మీద ఫిర్యాదు చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువకుడి వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి బంధువులు ఆరోపించారు. వినోభా నగర్​లోని యువకుడి ఇంటి ముందు మృతురాలి బంధువులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ నాగరాజు, ఎస్సై శ్రీకాంత్​లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వగా.. మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details