సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముర్షద్ గడ్డకు చెందిన అజారుద్దీన్‌తో గత సంవత్సరం హైదరాబాద్ గుడిమల్కాపూర్‌కు చెందిన సానియా ఫాతిమా అనే మహిళతో వివాహం జరిగింది. వివాహం జరిగిన సంవత్సర కాలంలో సానియా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక.. వివాహిత ఆత్మహత్య! - సిద్దిపేట జిల్లా నేరవార్తలు
అత్తారింటి వరకట్న వేధింపులకు వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివాహం జరిగిన నెల రోజుల్లోనే భర్త అజారుద్దీన్ దుబాయ్‌కి వెళ్లాడని... ఈ క్రమంలోనే అత్త, మామ, ఆడపడచులు సానియాను నిత్యం వేధించేవారని బంధువులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బ్యూటీ పార్లర్‌కు తీసుకొని వెళ్లి గుండు గీయించారని తెలిపారు. ఈ మధ్య కాలంలో దుబాయి నుంచి వచ్చిన భర్త మరింత వేధించాడని.. దీనితో మనస్తాపం చెందిన సానియా చనిపోయిందని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'