మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో తెల్లవారు జామున ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. త్రినయని(20) ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అయితే భర్త అక్షయ్ వేధింపులు తట్టుకోలేక... ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈసీఐఎల్‌కు చెందిన అక్షయ్ కుమార్.. రాంపల్లి చెందిన త్రినయని ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆపై పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం రాంపల్లి పీసీఆర్ ఎంక్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.