అత్తింటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెహిదీపట్నం మహేళ్ నగర్‌కు చెందిన ప్రియాంక ఇటీవలే అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో బర్కత్‌పురాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది వారం క్రితమే డిశ్చార్జీ అయ్యింది.
ఆందోళనలో కుటుంబం..
రామ్ కోఠిలోని జైన్ మందిర్ వద్ద భర్తతో కలిసి తన అత్తింటిలో ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలి అత్తమ్మ మిగతా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు చేపట్టినా నిష్ప్రయోజనమే ఎదురైంది.