మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని తుకారాంగేట్కు చెందిన మహిళ శనివారం ఇంటికి సమీపంలో ఉండే తల్లి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిన ఆమె అదృశ్యమైంది. అనంతరం బయటి నుంచి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులకు ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదు. డూప్లికేట్ తాళంతో తలుపులు తీసి చూడగా.. మంచంపై ఒక ఉత్తరం కనిపించింది.
వివాహిత అదృశ్యం.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు - medchal malkajgiri district news
ఇంటికి సమీపంలోని తన పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పిన జమా రాఖీ అనే వివాహిత అదృశ్యమైన సంఘటన సికింద్రాబాద్లోని తుకారాంగేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమె కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆ ఉత్తరంలో.. తనకు ఇక్కడ ఉండలేనని.. తన జీవితం.. తాను చూసుకుంటున్నానని.. ఎక్కడా వెతకొద్దని రాసి ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని.. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఎక్కడ వెతికినా జాడ లేదని తెలిపారు. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ.