తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం - Hyderabad crime news

ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం
ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

By

Published : Oct 30, 2020, 2:20 PM IST

పుట్టింటికి వెళ్తున్నానని ఇంటి నుంచి ఇద్దరు పిల్లలతో బయలుదేరిన వివాహిత అదృశ్యమైన ఘటన హైదరాబాద్​ కూకట్‌పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజీవ్​గాంధీ నగర్​లో ప్రేమయ్య.. భార్య మానస, ఇద్దరు పిల్లలు తేజ, యాస్వికలతో కలిసి నివసిస్తున్నారు. ప్రేమయ్య క్యాబ్ డ్రైవర్​గా పని చేస్తుండగా, మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది.

భర్త.. ఇద్దరు పిల్లలతో మానస

ఈనెల 28న ప్రేమయ్య ఉద్యోగానికి వెళ్లగా... మానస అతని భర్తకు ఫోన్ చేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్తున్నానని తెలిపింది. పిల్లలతో బయలుదేరిన మానస.. తల్లి వద్దకు చేరకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్​ రాగా ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

ABOUT THE AUTHOR

...view details