కుటుంబ కలహాలతో వివాహిత అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఠాణా పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం వడ్డెరగూడెం తాండాకు చెందిన జగదీశ్‌కు ఏడేళ్ల క్రితం పూజారాణితో వివాహమైంది. జగదీశ్ పాశమైలారం పారిశ్రామికవాడలో కిర్బీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్య పూజారాణి, కుమారుడు సిద్ధార్థతో కలిసి రుద్రారంలో నివాసం ఉంటున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత అదృశ్యం - సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మహిళ మిస్సింగ్
భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం భర్త విధులకు వెళ్లగానే.. భార్య ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. మళ్లీ తిరిగిరాలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

కొంతకాలంగా వారి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారుడు సిద్ధార్థను బంధువుల ఇంటికి పంపించారు. ఈనెల 15న భర్త జగదీశ్ పరిశ్రమలో విధులకు వెళ్లగా.. భార్య పూజారాణి... ఇంటినుంచి వెళిపోతున్నాను. తనకు బతకాలని లేదు తనను మర్చిపో నీకు అడ్డంరాను వేరే పెళ్లి చేసుకో అని లేఖరాసి ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది.
అప్పటినుంచి బంధువుల ఇళ్లవద్ద, అన్ని చోట్ల వెతికినా ఫలితం కన్పించకపోవడం వల్ల భర్త జగదీశ్ పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.