ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.
రూ. 21లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత - విజయనగరం నేర వార్తలు
ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 21 లక్షల విలువ చేసే గంజాయిని వాహనంలో గుర్తించారు.
గంజాయి, విజయనగరం
డ్రైవర్‌తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 21 లక్షలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.
ఇదీ చదవండి:'నాన్న.. నువ్వు నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు'