తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం భద్రాచలం కేంద్రంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా నిర్వహించిన తనిఖీలో ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా నల్గొండకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువ చేసే 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6 లక్షల విలువ చేసే 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్, నల్గొండ, వరంగల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకి గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
కారులో గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్
భద్రాచలం నుంచి హైదరాబాద్, నల్గొండ, వరంగల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకి గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారును, గంజాయిని సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.