తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు దారుణాలకు పాల్పడుతున్నారు. బీజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్దీల్ గ్రామంలోని ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు.
అనుమానంతో ఇద్దరు ఆదివాసీలను చంపేసిన మావోయిస్టులు - chatthisgad maoists
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. పోలీసుల ఇన్ఫార్మర్లు అనే అనుమానంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు దారుణంగా చంపేశారు.
![అనుమానంతో ఇద్దరు ఆదివాసీలను చంపేసిన మావోయిస్టులు Maoists killed 2 villagers brutally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9010979-106-9010979-1601555590531.jpg)
Maoists killed 2 villagers brutally
గ్రామస్థులిద్దరినీ బలవంతంగా అడవుల్లోకి తీసుకెళ్లిన మావోయిస్టులు... హత్యచేసి మృతదేహాలను గ్రామ సమీపంలో వదిలి వెళ్లారు. హత్యకు గురైన వ్యక్తులు ధని రామ్, గోపాల్‌గా గ్రామస్థులు గుర్తించారు. వీరిద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లు అనే నెపంతో హత్య చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. అయితే హత్యకు ముందు వారిద్దరిని చిత్రహింసలకు గురి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.