తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మావోయిస్టుల చెరలో బాలుడు.. ఆలస్యంగా వెలుగులోకి! - Telangana News Updates

ఏపీ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో బాలుడు అపహరణకు గురయ్యాడు. నవంబర్‌లో కొందరు మావోయిస్టులు ఇంటికి వచ్చి బలవంతంగా తమ బిడ్డను తీసుకెళ్లారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నెల గడిచినా జాడ లేకపోవడంతో ఇప్పుడు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.

mavoist
మావోయిస్టుల చెరలో బాలుడు.. ఆలస్యంగా వెలుగులోకి!

By

Published : Dec 22, 2020, 1:08 PM IST

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం విస్సాపురం పంచాయితీ గొల్లగుప్ప గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు(14) అపహరణకు గురయినట్లు ఎటపాక పోలీసులు తెలిపారు. ఎస్సై జ్వాలాసాగర్ వివరాల మేరకు.. కొందరు మావోయిస్టులు సదరు పిల్లాడిని తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు.

అయితే... నవంబరులో పిల్లాడి ఇంటికి వచ్చి.. తల్లిదండ్రులు వద్దని వేడుకున్నా వినకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఏం అవుతుందో అనే భయంతో వారు ఫిర్యాదు చేయలేదు. నెల గడుస్తున్నా పిల్లాడి జాడ లేకపోవడంతో స్థానికుల సహాయంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details