ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక, కొండాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని విచారించగా.. అతను మావోయిస్టు మిలీషియన్ దళ సభ్యునిగా పోలీసులు గుర్తించారు. లక్ష్మయ్య నుంచి కార్డెక్స్ వైర్, రెండు జిలిటెన్ స్టిక్స్, రెండు టిపిన్ బాక్సులు, రెండు డిటోనేటర్లు, ఒక తూటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ములుగులో మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్ట్ - eturunagaram asp arrested Maoist militia
సీపీఐ మావోయిస్టు మిలిషియా దళ సభ్యుడు మీడియం లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక, కొండాపూర్ వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ములుగులో మావోయిస్టు మిలీషియన్ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నెల 10న ఆలుబాకలో భీమేశ్వరరావును చంపిన ఘటనలో లక్ష్మయ్య నిందితుడని ఏటూరునాగారం ఏఎస్పీ తెలిపారు. పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు అందిస్తున్నందున అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:రూ.కోటీ 25లక్షల విలువైన గుట్కా పట్టివేత
Last Updated : Oct 17, 2020, 6:03 PM IST