భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో పోలీసులను హతమార్చేందుకు మందుపాతరలు తీసుకెళ్తున్న మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యుడు సూరయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్సై రతీశ్ సిబ్బందితో కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా గుండ్ల మడుగు గ్రామానికి చెందిన సూరయ్య మందుపాతరలు అమర్చేందుకు వెళ్తుండగా అతన్ని పట్టుకున్నట్లు అశ్వాపురం సీఐ సట్ల రాజు వెల్లడించారు.
అశ్వాపురంలో మావోయిస్టు కమిటీ సభ్యుడు అరెస్ట్ చేసిన పోలీసులు - భద్రాద్రిలో మావోయిస్ట్ అరెస్ట్ వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొందిగూడెంలో మావోయిస్టు గ్రామ కమిటీ సభ్యుడు సూరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఒక టిఫిన్ బాక్స్, 10 జెలిటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, 2 బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అశ్వాపురంలో మావోయిస్టు కమిటీ సభ్యుడు అరెస్ట్ చేసిన పోలీసులు
సూరయ్యను మూడేళ్ల క్రితమే మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యునిగా నియమించిందని.. అప్పటి నుంచి అతను మావోయిస్టులు.. వారి ప్రాంతానికి వచ్చినప్పుడల్లా నిత్యావసరాలు అందించి సహాయపడుతున్నట్లు సీఐ తెలిపారు. సూరయ్య నుంచి ఒక టిఫిన్ బాక్స్, 10 జెలిటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, 2 బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సహాయం అందించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు