భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను.. భద్రాచలం ప్రభుత్వం ఆస్పత్రిలో భద్రపరిచారు.
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు - చర్ల మండలంలో ఎదురు కాల్పుల వార్తలు
తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలోని శవాగారంలో భద్రపరిచారు. మృతుల కుటుంబసభ్యులు వస్తే భౌతికకాయలు అప్పగిస్తామని ఎస్పీ తెలిపారు.
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు
పాల్వంచకు చెందిన ఫోరెన్సిక్ డాక్టర్ నవీన్ వారికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతులకు సంబంధించిన కుటుంబసభ్యులు వస్తే వారికి మృతదేహాలను అప్పగిస్తామని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.