భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక మావోయిస్టు మిలిషియా సభ్యున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చర్ల మండలం బక్కచింతల పాడు గ్రామానికి చెందిన రవ్వ ఉంగయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను 2017 నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ.. మావోలకు సరుకులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్ - bhadradri kothagudem maoist arrest news
మావోలకు సరుకులు సరఫరా చేస్తున్న మావోయిస్టు మిలిషియా సభ్యున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతడు పట్టుబడ్డాడు.
దుమ్ముగూడెంలో మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్
ఈరోజు మావోయిస్టుల కరపత్రాలను అంటించడానికి దుమ్ముగూడెం వెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి విప్లవ కరపత్రాలు స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ ఎమ్.రవికుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాజస్థాన్-హరియాణా సరిహద్దులో ఉద్రిక్తత