యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకుందుకూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో శవమై తేలాడు. గ్రామానికి సమీపంలో ఉన్న వాగులో నీటిపై తేలిన శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని వద్ద దొరికిన చరవాణి, పాలబిల్లు ఆధారంగా మృతుడు శరత్‌కుమార్(26)గా పోలీసులు గుర్తించారు.
వాగులో యువకుడి మృతదేహం లభ్యం... మృతిపై పలు అనుమానాలు - యాదాద్రి భువనగిరి జిల్లాలో యువకుడి మృతదేహం లభ్యం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దకుందుకూర్-మాసాయిపేట గ్రామాల మధ్యన ఉన్న వాగులో శవమై తేలాడు. మృతుడు గజ ఈతగాడు కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాగులో యువకుడి మృతదేహం లభ్యం...మృతిపై పలు అనుమానాలు వాగులో యువకుడి మృతదేహం లభ్యం...మృతిపై పలు అనుమానాలు
మూడు రోజుల నుంచి అతను కనిపించకపోవడంతో సోదరుడు సునీల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఇంటికి తిరిగి వస్తాడకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అతను గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడని స్థానికులు తెలిపారు. మృతుడు గజ ఈతగాడు కావడంతో వాగులో నిలిచి ఉన్న నీళ్లలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.