తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యభిచారగృహంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు - మంచిర్యాలలో వేశ్యగృహం నిర్వహణ తాజా వార్త

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై దాడిచేసి 8మందిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ తెలిపారు.

mancherial police attack on Brothels and some people were arrested
వ్యభిచారగృహంపై దాడి.. 8మంది అరెస్టు

By

Published : Oct 19, 2020, 3:55 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. జిల్లాకు చెందిన ముగ్గురు నిర్వాహకులు హైదరాబాద్​కు చెందిన ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి కాగజ్​నగర్ పట్టణానికి చెందిన 5 గురు విటులతో కలిసి వ్యభిచారం నిర్వహింస్తుండగా రెడ్​హ్యాడెడ్​గా పట్టుకుని అరెస్ట్ చేశామని డీసీపీ ఉదయ్​కుమార్​ తెలిపారు.

అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఎవరైనా ఇంటిని అద్దెకు ఇచ్చే క్రమంలో పూర్తి వివరాలు తెలుసుకోవలని కోరారు. ఎవరైనా అనుమానితులుగా ఉన్నట్లు అనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితుల నుంచి 15 వేల నగదు, 7 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నామని డీసీపీ వెల్లడించారు.

ఇదీ చూడండి:జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details