సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మరణించాడు. గ్రామానికి చెందిన షేక్ హమీద్(38) అనే యువకుడు గ్రామంలో విద్యుత్‌కు సంబంధించి తాత్కాలికంగా పనులు చేసేవారు. స్థానికుల అవసరాల కోసం స్తంభం ఎక్కి విద్యుత్ సమస్యలు పరిష్కరించేవాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - తడ్కల్‌లో తాత్కాలిక విద్యుత్ ఉద్యోగి మృతి
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్‌లో జరిగింది. గ్రామంలో కరెంట్ కోత ఉన్న దగ్గర మరమ్మతులు చేయడానికి వెళ్లగా.. అప్పుడే విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మరణించాడు.
విద్యుదాఘాతంతో మరణించిన విద్యుత్ శాఖలో పనిచేసే వ్యక్తి
మంగళవారం ఉదయం గ్రామంలో కరెంట్ లేని చోట మరమ్మతులు చేయడానికి వెళ్లగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అంది. హమీద్ కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. మృతుని కుమారుడు ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండిఃచేపలకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి