మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి రాజు కాలనీలో ఉన్న పాల వ్యాపారి యజమాని తన నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న మధ్యాహ్నం తాను పాల ప్యాకెట్లను లెక్కించేటప్పుడు.. అతడిని మాటల్లో పెట్ట అదే టేబుల్‌పై ఉన్న రూ. 58, 000 నగదును ప్రవీణ్ అనే వ్యక్తి దొంగిలించాడు. ఈ విషయాన్ని యజమాని గుర్తించగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలానగర్‌లో యజమాని వద్ద నగదు దొంగలించిన వ్యక్తి అరెస్ట్ - man who theft from owner in balanagar police station limits
యజమాని దృష్టి మరల్చి నగదు దొంగిలించిన కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
బాలానగర్‌లో యజమాని వద్ద నగదు దొంగలించిన వ్యక్తి అరెస్ట్
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడు ప్రవీణ్‌ను గురువారం పట్టుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:కేంద్ర జల్ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్