తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గోదారమ్మ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజమాబాద్​ జిల్లా ఎస్సారెస్పీ ప్రాజెక్టు దిగువనున్న పుష్కర్​ఘాట్​ వద్ద కుటుంబంతో కలిసి గంగా స్నానానికి వెళ్లిన యువకుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పోలీసుల ఆధ్వర్యంలో జాలరులు గాలింపు చర్యలు చేపట్టారు.

man went missing in sriram sagar project flow
గోదారమ్మ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు

By

Published : Oct 16, 2020, 8:51 PM IST

నిజామాబాద్​ జిల్లా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న పుష్కర్ ఘాట్​ వద్ద నగేష్​ అనే యువకుడు గల్లంతయ్యాడు. జక్రాన్​పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన నగేష్​... కుటుంబసభ్యులతో కలిసి గంగా స్నానానికి వెళ్లగా... ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు.

విషయం తెలుసుకున్న మెండోరా ఎస్సై సురేష్​, తహసీల్దార్​ జనార్దన్ ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.​ నదిలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున గాలించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు జాలరులు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details