తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైల్​ ఇంజిన్​కు చిక్కుకుని వ్యక్తి మృతి.. కేసు నమోదు - నెల్లూరు తాజా వార్తలు

రైలు ఇంజిన్​కు చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఏపీలోని నెల్లూరులో జరిగింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

man-was-trapped-inside-the-train-engine-and-died-at-nellore
రైల్​ ఇంజిన్​కు చిక్కుకుని వ్యక్తి మృతి.. కేసు నమోదు

By

Published : Dec 4, 2020, 7:30 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో ఓ వ్యక్తి రైలు ఇంజిన్​కు చిక్కుకొని మృతి చెందాడు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్​ రైలు ఇంజిన్​కు చిక్కుకున్నట్లు వేదాయపాలెం స్టేషన్ సమీపంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆపి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా దూరం వరకు ఆ వ్యక్తి వేలాడుతూ.. వచ్చినట్లు తెలుస్తోంది.

మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి ఎక్కడ రైలు ఇంజిన్​కు చిక్కుకున్నాడు, ఉద్దేశపూర్వకంగా ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పెళ్లయిన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య..

ABOUT THE AUTHOR

...view details