తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాలువలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి - tractor overturned during the NESP season news

వైరా మండలం సోమవారంలో విషాదం చోటుచేసుకుంది. కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.

Man died after tractor overturns in Ennespee canal
ఎన్నెస్పీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

By

Published : Dec 31, 2020, 4:54 PM IST

ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారంలో ఎన్నెస్పీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి దుర్గం కృష్ణ మూర్తి అనే వ్యక్తి మృతి చెందాడు. నీటిలో నుంచి అతన్ని స్థానికులు బయటికి తీసీ అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.

గ్రామంలోని కాల్వకట్టపై ట్రాక్టర్​తో పొలానికి బయలుదేరాడు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కాలవలో పడింది. అందులో నుంచి కృష్ణ మూర్తిని బయటకు తీసి అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతని మరణం ఊరిలో అందర్నీ కలిచివేసింది.

ఇదీ చూడండి:అద్దె బస్సుల యజమానుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details