మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మీనుగోనుపల్లికి చెందిన బుడగ జంగాల మన్యంకొండ (48) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వెనక నుంచి వచ్చి..
పనులు ముగించుకుని గ్రామానికి వెళ్తుండగా ఆంధ్ర బ్యాంకు వద్ద వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ వరంగల్ డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై భగవంతు రెడ్డి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.