హైదరాబాద్ పంజాగుట్టలో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసుల పైలాన్ ఎక్కి తన చొక్కాతో ఉరేసుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు గమనించి కాపాడారు.
ట్రాఫిక్ పైలాన్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. - man tried to committ suicide in Hyderabad
హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. ట్రాఫిక్ పైలాన్ ఎక్కి ఉరేసుకోవడానికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు రక్షించారు.

జహీరాబాద్ మండలం న్యాల్కల్కు చెందిన రవి వృత్తిరీత్యా డ్రైవర్. కొంతకాలంగా మానసికంగా రవి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు అతణ్ని చందానగర్‌లోని మెడికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు ఖర్చు ఎక్కువగా అవుతుండటం వల్ల నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యులతు తెలియకుండా ఆస్పత్రిని నుంచి తప్పించుకున్న రవి.. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్ పైలాన్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తాడుతో రక్షించేందుకు ప్రయత్నించగా... తాడును మెడకు బిగించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రవిని కాపాడారు. అనంతరం అతణ్ని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
- ఇదీ చూడండి :ట్రాలీఆటో బోల్తా... 18 మందికి గాయాలు