కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఈఎస్ఐ కాలనీ సమీపంలోని పాడుబడ్డ క్వార్టర్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
కాగజ్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - కాగజ్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ]
కుమురం భీం జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మృతుడు పట్టణానికి చెందిన సాబీర్(30)గా గుర్తించారు. పట్టణ ఎస్హెచ్ఓ మోహన్ ఘటనస్థలిని పరిశీలించి మృతుడి కుటుంబీకుల వద్ద వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫరీదుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యనా.. ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, పాప ఉన్నారు.