వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నరావుపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఊరెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరిన దయాకర్ చెన్నారావుపేట శివారులోని కట్టు కాలువలో నిర్జీవంగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి.. కేసు నమోదు - వరంగల్ క్రైమ్ వార్తలు
ఊరెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలో చోటు చేసుకుంది. ఇది హత్యా.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు సంగెం మండలం లోహిత మూలతండాకు చెందిన దయాకర్గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దయాకర్ది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.