లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోల్కొండకు చెందిన మోజం హుస్సేన్ తాను పని చేసే న్యూ విన్నర్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వైరుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులతో.. వ్యక్తి ఆత్మహత్య! - లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధి
ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాను పనిచేసే ఎలక్ట్రిక్ దుకాణంలో మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
![ఆర్థిక ఇబ్బందులతో.. వ్యక్తి ఆత్మహత్య! Man Suicide In Langar house Area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8598582-612-8598582-1598666437789.jpg)
ఆర్థిక ఇబ్బందులతో.. వ్యక్తి ఆత్మహత్య!