హెచ్ఎండీఏలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న అరుణ్ కుమార్... భార్య ప్రమీణ, ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో నివాసముంటున్నాడు. పదేళ్లపాటు సజావుగా సాగినా వారి సంసార జీవితం... గత కొన్ని రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్థలు గొడవలకు దారితీశాయి.
భార్యాభర్తల మధ్య గొడవ... మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య - arun kumar suicide by hanging in bowenpally
భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

భర్యాభర్తల మధ్య గొడవ... మస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య
ఇదే విషయమై వారిద్దరూ... ఒకరిపై మరోకరు కేసులు పెట్టుకున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో శనివారం జరిగిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. కౌన్సిలింగ్ అనంతరం ఇంటికి వెళ్లిన అరుణ్ మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:అమానవీయ రీతిలో కరోనా మృతుని ఖననం
Last Updated : Jun 7, 2020, 5:30 PM IST