తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మైనర్​ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం - Rape of a minor girl is the latest news

నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా... మహిళలు, చిన్నారులపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని అమ్మాయిలపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

man arrested
మైనర్​ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం

By

Published : Jan 6, 2021, 12:42 PM IST

హైదరాబాద్ శంషాబాద్​ ఎయిర్​పోర్టు కాలనీకి చెందిన ఓ మైనర్​ బాలికపై అత్యాచారం చేశాడో ఓ కిచకుడు. గత మూడేళ్లుగా తనపై పూల వ్యాపారి సతీశ్ లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.

పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు... పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details