తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం తాగించి రెచ్చగొట్టారు.. స్కూటర్​తో గుద్ది చంపేశారు - వ్యక్తి హత్య

భూతగాదాలతో వ్యక్తిపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచి వ్యక్తిని హత్య చేసిన ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండల పరిధిలో చోటు చేసుకుంది. భూమి విషయంలో తమతో కావాలనే తగాదా పెట్టుకొని.. మనుషులకు మద్యం తాగించి హత్య చేశారని మృతుడి కుమారుడు ఆరోపించాడు.

man murdered with land disputes in siddipet
మద్యం తాగించి రెచ్చగొట్టారు.. స్కూటర్​తో గుద్ది చంపేశారు

By

Published : Oct 16, 2020, 1:48 PM IST

సిద్ధిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండలం అంతాయగూడలో భూ తగాదాలతో వ్యక్తిపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన పోచయ్య మృతి చెందాడు. గ్రామంలో గత కొంతకాలంగా భూమి విషయంలో పోచయ్యకు.. గ్రామ సర్పంచ్​తో ఘర్షణలు జరుగుతున్నాయి. కరోనా సమయంలో కూడా.. తమను ఊరి నుంచి బహిష్కరించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మృతుడి కుమారుడు ఆరోపించాడు.

భూ వివాదంపై ఫిర్యాదు చేసినందుకు.. పలుమార్లు బహిరంగంగానే తమను చంపుతామని సర్పంచ్​ బెదిరించారని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మద్యం తాగించి.. తన తండ్రి పొలం వద్దకు వెళ్లి వస్తుుండగా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపారని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:కరోనా పరీక్షలు, సెరో సర్వేలు పెంచాలి: మోదీ

ABOUT THE AUTHOR

...view details