తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వేములవాడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం - సిరిసిల్ల వార్తలు

పాతకక్షలు మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు సమీపంలోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో చనిపోయాడు.

Man Murdered in Rajanna Siricilla District Vemulawada
వేములవాడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం

By

Published : Sep 26, 2020, 7:24 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని మహాలక్ష్మి వీధికి చెందిన రాజు, శ్రీనివాస్ గౌడ్​లకు పాతకక్షలున్నాయి. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్​ను రాజు అనే వ్యక్తి గొడ్డలితో విచక్షణరహితంగా నరికాడు.

తీవ్ర గాయాలతో.. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాస్ గౌడ్​ను స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా బాధితుడు మృతి చెందాడు. పట్టణ సీఐ వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వేములవాడ డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ ఇచ్చిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details