పాత కక్షల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కామేపల్లి మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో ఊటా వాగు వద్ద ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మడవి సోమయ్యను(56) పాత తగాదాల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గంగయ్య, తీసయ్య, ఆదాం అనే ముగ్గురు హత్య చేసినట్టు ఎస్సై స్రవంతి తెలిపారు.
పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య - crime news
పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఊట వాగు సమీపంలో నివసిస్తున్న సోదరుడు లక్ష్మయ్య ఇంటికి ఈ నెల 14న సోమయ్య వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులు కూడా తాము ఈ ప్రాంతంలో ఏదైనా ఉపాధి చూసుకుంటామని వచ్చారు. లక్ష్మయ్యను నమ్మించి అక్కడే ఉన్నారు. లక్ష్మయ్య గేదెలను బయటకు తీసుకెళ్లిన సమయంలో సోమయ్యను దారుణంగా హత్య చేశారని ఎస్సై స్రవంతి తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసులు పరిశీలించారు. లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: అక్రమంగా బ్లాస్ట్ చేశాడు.. ప్రాణాలు వదిలాడు