హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హారాజ్పెంట బస్తీలో లింగయ్య(30) అనే వ్యక్తి తలపై బండరాయితో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈస్ట్ జోన్ అడిషనల్ కమిషనర్ రమేష్, కాచిగూడ పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బండరాయితో కొట్టి వ్యక్తి దారుణహత్య - crime news
గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి తలపై బండరాయితో కొట్టి హత్య చేసిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బండరాయితో కొట్టి వ్యక్తి దారుణహత్య