తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తలపై బండరాయితో మోది హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు - pv express highway murder news

హైదరాబాద్​ నగర శివారులోని రాజేంద్రనగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం అర్థరాత్రి ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

man murdered brutally by hitting with stoone at rajendranagar
తలపై బండరాయితో మోది హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు

By

Published : Sep 25, 2020, 3:06 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని రాజేంద్రనగర్​ సర్కిల్ ఉప్పర్​పల్లి పీవీ ఎక్స్​ప్రెస్​ హైవే పిల్లర్​ నెంబర్​ 161 పక్కనున్న ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని డాగ్​స్క్వాడ్, క్లూస్​ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

అయితే మృతుడి వివరాలు తెలీనందున గుర్తుతెలియని హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి ఆ వ్యక్తి తలపై బండరాయితో మోది దుండగులు హత్య చేసినట్లు ప్రాథమికంగా వెల్లడించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ABOUT THE AUTHOR

...view details